హానర్ 10 లైట్ వచ్చేస్తుంది..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్ నుండి హానర్ 10 లైట్ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. జనవరి 15 నుండి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో రాబోతుంది. నీలి, తెలుపు, నలుపు మూడు రంగుల్లో ఈ ఫోన్ ఉండబోతుంది.

4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ, 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ, 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ అనే వేరియంట్ల రూపంలో లభ్యమౌతోంది. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి ప్రారంభం కానుందని అంటున్నారు.

ఇక దీని ఫీచర్లు చూస్తే..

* ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌
* 6.21 అంగుళాల స్క్రీన్, వాటర్ డ్రాప్ డిస్‌ప్లే
* కిరిన్ 710 ప్రాసెసర్, ఏఆర్‌ఎం మలీ జీ51 జీపీయూ
* ఈఎంయూఐ 9, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా
* 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.