హానర్ మ్యాజిక్ 2 3డీ ఫీచర్లు చూస్తే షాకే…

ప్రముఖ మొబైల్ సంస్థ హానర్..ఇప్పటికే పలు రకాల మోడల్స్ అందించి ఆకట్టుకోగా..తాజాగా హానర్ మ్యాజిక్ 2 3డీ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర దాదాపు రూ.60,000 గా ఉంది. హానర్ మ్యాజిక్ 2 స్మార్ట్‌ఫోన్‌కు ఇది కొత్త వెర్షన్ అని తెలిపింది.

ఈ ఫోన్ లో 3డీ బయోనిక్ సెన్సిటైజేషన్ టెక్నాలజీ తో పాటు మ్యాజిక్ 2 3డీ ఎడిషన్‌లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే ఈ ఫోన్ బ్యాటరీ 55 నిమిషాల్లో ఫుల్ అవ్వడం మరో ప్రత్యేకం.

ఇంకా ఈ ఫోన్లో ఏ ఏ ఫీచర్లు ఉన్నాయో మీరే చూడండి.

* 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమ్‌‌లెడ్ డిస్‌ప్లే
* స్లైడ్ డిజైన్
* ఫ్లాగ్‌షిప్ హిసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్
* ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+24 ఎంపీ+16 ఎంపీ)
* ట్రిపుల్ ఫ్రంట్ కెమెరా (16 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ)
* 3డీ ఫేస్ అన్‌లాక్
* ఇన్‌స్కీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్