మోటో జీ6 ప్లస్ ఫీచర్లు కేక


మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ6 ప్లస్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.22,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో, మోటో హబ్ స్టోరస్‌లో లభిస్తున్నది. పేటీఎం మాల్ యాప్‌ను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. జియో కస్టమర్లకు ఈ ఫోన్‌తో రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వోచర్లు లభిస్తాయి. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించారు.

మోటో జీ6 ప్లస్ ఫీచర్లు…

* 5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్
* 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* పీ2ఐ వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్
* డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
* ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.