నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్ ధర చాలా చీఫ్ ..

ప్రముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబ‌ల్ నోకియా 3.2 ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8,990 లభ్యం కానుంది . ఈ నెల 23వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులో రానున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ ఫోన్‌ను కొన్న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.1వేయి విలువైన గిఫ్ట్ కార్డును ఇస్తారు. దానికి జూన్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. అలాగే 6 నెల‌ల కాల వ్య‌వ‌ధి గ‌ల వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నారు .

నోకియా 3.2 ఫీచ‌ర్లు చూస్తే..

* 6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 720 x 1520 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* స్నాప్‌డ్రాగ‌న్ 429 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
* 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.