నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్ ధర ఎంత తగ్గిందో తెలుసా..?

ప్రముఖ హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నోకియా 7.1 ధ‌ర‌ను భార‌త్‌లో త‌గ్గించింది. రూ.19,999 తో భారత మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.17,999 అందుబాటులోకి వస్తుంది. ప‌లు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌పై మ‌రింత డిస్కౌంట్‌ను పొందవచ్చని సంస్థ చెపుతుంది.

తాజాగా హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న వెబ్‌సైట్‌లో కేకేఆర్ మ్యాచ్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను కూడా నిర్వ‌హిస్తున్న‌ది. అందులో భాగంగా నోకియా 8.1, 7.1. 6.1 ప్ల‌స్‌, 5.1 ప్ల‌స్‌, నోకియా 81104జీ ఫోన్ల‌పై 15 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

నోకియా 7.1 ఫీచర్లు చూస్తే..

* 5.84 అంగుళాల తెర
* 1080 x 2280 పిక్సల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 ఓఎస్‌, 9.0 వెర్షన్‌ అప్‌డేటెడ్ వెర్షన్.
* 1.8 గిగాహెర్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* వెనుకవైపు 12+5 మెగాపిక్సల్స్‌ డ్యుయల్‌ కెమెరా
* ముందువైపు 8 మెగా పిక్సల్‌ కెమెరా
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ స్టోరెజ్‌, 400 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.
* 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ – సి
* ఫాస్ట్ చార్జింగ్. 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్