నోకియా 8.1 వచ్చేసిందోచ్..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా నుండి నోకియా 8.1 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ విడుదల చేయగా ..ఈ ఫోన్‌లో 6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఫోన్‌కు సంబంధించి 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధరను రూ.29,999గా.. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.26,999గా నిర్ణయించారు. బ్లూ, సిల్వర్, ఐర‌న్/స్టీల్ క‌ల‌ర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

నోకియా 8.1 ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి..

* 6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2246 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
* ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్
* 4/6 జీబీ ర్యామ్‌
* 64/128 జీబీ స్టోరేజ్‌
* 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
* 12, 13 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్-సి
3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ (ఫాస్ట్ చార్జింగ్‌) .