నోకియా నుండి మరికొన్ని ఫీచర్ ఫోన్లు..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ నోకియా..తాజాగా రీ ఎంట్రీ ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్ ఫోన్లను తీసుకొస్తుంది. ఇప్పటికే పలు మోడల్స్ ను తీసుకొచ్చిన నోకియా..తాజాగా అక్టోబర్‌ 4న లండన్‌ వేదికగా జరగబోయే ఈవెంట్ కోసం సరికొత్త మోడల్స్ ను ప్రవేశ పెడుతుందట. నోకియా 7.1 ప్లస్‌ అక్కా నోకియా ఎక్స్‌7ను లాంచ్‌ చేస్తుందని అంటున్నారు.

అలాగే నోకియా ఎక్స్‌6 (నోకియా 6.1 ప్లస్‌) మాదిరి చైనాలో నోకియా ఎక్స్‌7(నోకియా 7.1 ప్లస్‌) పేరుతో మార్కెట్‌లోకి రాబోతుంది. నోకియా 7.1ప్లస్‌ కూడా నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ మాదిరి ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ నాచ్‌ డిస్‌ప్లే, ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌తో రూపొందుతోంది. జీస్‌ లెన్సెస్‌తో వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉందని సమాచారం.