శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ ధర ఎంతో తెలుసా…?

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తాజాగా తమ వినియోగదారులకు తీపి కబురు తెలిపింది. సరికొత్త శాంసంగ్ స్మార్ట్ వాచ్ ను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. ఈ 42ఎంఎం వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ ప్రారంభ ధర రూ. 22,600 , 46ఎంఎం వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ రూ. 24,000గా సంస్థ నిర్ణయించింది.

ఆగస్టు 31న దక్షిణ కొరియా, ఇతర మార్కెట్లలో సెప్టెంబర్ 14న అమెరికా మార్కెట్‌లో ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. బ్లూటూత్ వేరియంట్, ఎల్టీఈ వేరియంట్ వాచ్ రేట్లను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.