వివో నుండి జ‌డ్‌3ఐ..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో..తాజాగా జ‌డ్‌3ఐ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. దీని ధర ను రూ.20,900 గా నిర్ణయించింది.

ఈ ఫోన్ లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేతో పాటు 6జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తుంది. అలాగే వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాలు , ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఫీచర్లు చూస్తే..

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 1080 x 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* మీడియాటెక్ హీలియో పి60 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌
* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాట‌రీ.