50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’..


ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

కాగా OG యొక్క 3 వ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. దీంతో ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. “ఇప్పటివరకు యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా.. మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి. ఇక రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి” అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు జూలై, ఆగస్ట్‌ లో జరగనున్న షెడ్యూల్స్‌తో మొత్తం షూటింగ్‌ను త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. దీంతో ఈ సినిమా థియేటర్‌ లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే దర్శకుడు సుజీత్ అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించాలని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2023లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.