Chandini Chowdary : సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో చాందినీ చౌదరి న్యూ మూవీ లాంచ్!!

Chandinichowdary
Chandini Chowdary : చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రల్లో వికాస్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో ఓ వినూత్న చిత్రం రూపుదిద్దుకుంటోంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, సహచారి ప్రొడక్షన్ 2 లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ విన్నాను. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలిపారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ, సహచారి క్రియేషన్స్ సినిమా ఇండస్ట్రీలో కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేయబోతోందని, సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ చిత్రంలో సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉండనుందని, ఎవరు ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నామని చెప్పారు. త్వరలోనే కాన్సెప్ట్ వీడియో విడుదల కానుంది. ఇక నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, పవన్ సంగీతం అందిస్తున్నారు. జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.