Santhana Prapthirasthu : రామ్ మిరియాల పాడిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ టైటిల్ సాంగ్ రిలీజ్!

Santhanaprapthirasthu
Santhana Prapthirasthu : విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించగా, కథ-స్క్రీన్‌ప్లేను షేక్ దావూద్ జి అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

Also Read :  Ilaiyaraaja: ఇళయరాజా బర్త్‌డే స్పెషల్.. ఈ లెజెండ్ ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే!

“సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు…” అంటూ మొదలయ్యే ఈ పాటలో నేటి యువత మ్యారెడ్ లైఫ్‌స్టైల్‌ను సరదాగా చూపించారు. “నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్‌లో రొమాన్స్‌కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు…” వంటి లైన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల అద్భుతంగా పాడగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రామ్ మిరియాల పాడిన పాటలన్నీ హిట్ అయ్యినట్టే, ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్ తదితరులు నటిస్తున్నారు.

Also Read :  Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊచకోత.. మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్ రికార్డ్!