బోట్లతో ‘బ్రో’ ప్రమోషన్స్ !!


పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

తాజాగా గోదావరి జలాల్లో ప్రత్యేకమైన బోట్ యాక్టివిటీతో ప్రమోషన్లను పెంచింది చిత్రబృందం. ‘బ్రో’ టైటిల్ ను నదిలో బోట్లతో అరెంజ్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. అంతేకాదు బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌ లు ఆన్ ది వే అంటూ ట్వీట్ చేసారు చిత్రబృందం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.