Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెల్ అంతే !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలే వున్నాయి. అందుకే ఎక్కడా రాజీపడకుండా కళ్యాణ్ రామ్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనిపించనున్నారు. ఇకపోతే తాజాగా ఈసినిమా నుండి గ్లింప్స్ ని రిలీజ్ మేకర్స్.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇక గ్లింప్స్ వీడియోని చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఎన్టీఆర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. వేరే లెవెల్. ఇక చివర్లో “ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చుసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు”.. అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదుర్స్. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025