HIT 3 : ఏపీలో ‘హిట్ 3’ టిక్కెట్ల ధరల పెంపు


HIT 3 : ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు మాస్ అవతారంలో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవల్లో విడుదల కావడంతో నాని దేశవ్యాప్తంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఇదిలా ఉండగా, ఈ సినిమా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసింది. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్స్‌లో ₹50, మల్టీప్లెక్స్‌లలో ₹75 (జీఎస్టీతో కలిపి) అదనంగా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మూవీ విడుదలైన తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.