Producer Shirish : రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణ చెప్పిన నిర్మాత


Producer Shirish : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి. దీంతో హర్ట్ అయిన రామ్ చరణ్ అభిమానులు హెచ్చరికతో కూడిన ఓ లేఖ విడుదల చేశారు. “గేమ్ చేంజర్ సినిమా గురించి లేదా రామ్ చరణ్ గురించి ఎవ్వరైనా తప్పుడు రీతిలో మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని స్పష్టం చేశారు.

Also Read :  Peddhi Movie Budget: "పెద్ది" బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

ఈ నేపథ్యంలో దిల్ రాజు మంగళవారం స్పందించి, మాకు మరియు రామ్ చరణ్ కు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టత ఇచ్చి ఆ వివాదాన్ని కొంతమేర శాంతింపజేశారు. ఇక తాజాగా శిరీష్ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ క్షమాపణలు కోరారు. శిరీష్ స్పందిస్తూ.. “నేను ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలను తప్పుడు విధంగా అర్థం చేసుకున్నారు. అయితే, నా వ్యాఖ్యల వల్ల కొంతమంది మెగా అభిమానులు బాధపడ్డారని నేను గుర్తించాను. గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ తన సమయాన్ని, మద్దతును ఇచ్చారు. మేము మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాం. మేమెప్పుడూ చిరంజీవి గారు, చరణ్ గారు, లేదా ఇతర మెగా హీరోల గురించి చెడుగా మాట్లాడం. ఎవరికైనా నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే నేను క్షమాపణలు కోరుతున్నాను” అన్నారు.

Also Read :  Raghava Lawrence: సినిమా టు పాలిటిక్స్.. విజయ్ 'టీవీకే'లో చేరిన రాఘవ లారెన్స్! సీఎం సీటు నుంచే బరిలోకి!