War 2 : ‘వార్ 2’ ప్రమోషన్స్‌కి న్యూ స్ట్రాటెజీ.. ఎన్టీఆర్, హృతిక్ కలయిక తెరపైనే


War 2 : యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ సినిమాలను ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయి. ఇప్పుడు ‘వార్ 2’ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ వ్యూహాన్ని రూపొందించింది. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతోన్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌నే సినిమాకి ప్రధాన ఆకర్షణగా మార్చే దిశగా YRF భావిస్తోంది. అందుకే ప్రమోషన్ల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ప్రమోషన్స్‌లో ఈ ఇద్దరూ విడివిడిగా పాల్గొంటారు కానీ కలసి ఎక్కడా కనిపించరు. ఫ్యాన్స్‌కి ఈ జోడీని ఒకే సారి చూసే అవకాశం తెరపైన మాత్రమే లభించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వార్ 2’ పైన అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులలో థ్రిల్ మరింత పెంచేలా ఈ వ్యూహం పనిచేస్తుందనే నమ్మకంతో యష్ రాజ్ ఫిల్మ్స్ ముందుకు సాగుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదల కానుంది.