Kothapallilo Okappudu Teaser : మన ఊరి మన కథ – కొత్తపల్లిలో ఒకప్పుడు


Kothapallilo Okappudu Teaser : రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్ మీడియా మరో విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి నటి, నిర్మాత అయిన ప్రవీణ పరుచూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో పల్లె జీవితం, అక్కడి గాసిప్ కల్చర్‌, కలలు, సంబంధాలు అన్నీ హాస్యభరితంగా, ఫీల్‌గుడ్ టచ్‌తో నెరేపారు. హీరోగా మనోజ్ చంద్ర కనిపించే ఈ కథలో, అతను నడిపే డ్యాన్స్ స్టూడియో, డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెతకడం, ఊహించని చిక్కుల్లో పడటం వంటి విశేషాలన్నీ గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా చూపించారు.

సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్‌ను ఫన్‌తో నింపింది. పెట్రోస్ ఆంటోనియాడిస్ సినిమాటోగ్రఫీ పల్లె టోన్‌ను అద్భుతంగా అందించగా, మోనికా టి, ఉషా బోనెల నటన సహజంగా ఆకట్టుకుంది. గురుకిరణ్ బత్తుల అందించిన కథ, సంభాషణలకు మంచి ఫ్లో ఉంది. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి నెరేషన్‌లో హాస్యం, భావోద్వేగాలు కలిసి ఒక వినూత్నమైన గ్రామీణ అనుభూతిని అందించబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో, జూలై 18న థియేటర్లలో విడుదలకానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.