Samantha : ‘ఓ బేబీ’ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? సమంత–నందిని రెడ్డి కాంబో మరోసారి స్క్రీన్‌పైకి?


Samantha : తెలుగు సినీ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసిన ఓ బేబీ సినిమా తర్వాత, అదే బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. సమంతా మరియు దర్శకురాలు నందిని రెడ్డి కలిసి మరో కొత్త సినిమాతో కలసి పని చేయబోతున్నారు. ఈసారి ఈ ప్రయాణం మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ను సమంత స్వయంగా స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్యానర్ పై శుభం సినిమాను నిర్మించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

2019లో వచ్చిన ఓ బేబీ సినిమా సమంతకు కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. తల్లి–కొడుకు భావోద్వేగాలతో నిండిన ఆ చిత్రం, హాస్యంతో పాటు జీవిత సత్యాలను అందరికీ దగ్గర చేస్తూ ఓవర్‌నైట్ హిట్ అయింది. ఇప్పుడు అదే డైరెక్టర్, అదే నటితో మరోసారి అలాంటి కథను చెప్పబోతున్నారంటే… ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటడం సహజం. కథ, ఇతర నటీనటులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా… ఈ ప్రకటనే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘ఓ బేబీ’ తరహా హార్ట్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మళ్లీ వస్తుందని సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది.