Kingdom : ‘కింగ్‌డమ్’ సెన్సార్ పూర్తి.. విజయ్ మాస్ ఎంట్రీకి రంగం సిద్ధం!

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే, మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

అన్నదమ్ముల మధ్య సాగే భావోద్వేగ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన పాట ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఆకర్షణగా నిలవనుంది. సెన్సార్ నుంచి U/A లభించడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించేలా మారబోతున్నదని చిత్రబృందం ఆశిస్తోంది. ఇక ఈ రోజు సాయంత్రం సినిమా ట్రైలర్ విడుదల కానుండగా, సినిమా మాత్రం జూలై 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.