Thank You Dear : ఇంట్రెస్టింగ్ టర్న్స్‌తో ఆకట్టుకుంటున్న ‘థాంక్యూ డియర్’ ట్రైలర్!

Thankyoudear
Thank You Dear : మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా, తోట శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’ ఆగస్టు 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఓ పాటను మంచు మనోజ్ లాంచ్ చేయగా, టీజర్‌ను వివి వినాయక్ విడుదల చేశారు.

Also Read :  Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊచకోత.. మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్ రికార్డ్!

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే, ముగ్గురు పాత్రల మధ్య ప్రేమ, మాయ, మతిమరుపు అంశాలతో కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రేఖా నిరోషాతో పెళ్లయిన హీరో ధనుష్, హెబ్బా పటేల్‌తో ప్రేమలో పడతాడు. ఈ త్రికోణ ప్రేమ కథలో హీరో ఎలా సమతుల్యం సాధించాడన్నది ఆసక్తికరంగా ట్రైలర్‌లో చూపించారు. డైలాగ్స్ హాస్యాన్ని తాకుతూ, యూత్‌ఫుల్ టచ్‌తో ఉండగా, కథలోని మలుపులు సినిమాను మరింత ఉత్కంఠభరితంగా మార్చేలా ఉన్నాయి. ఇప్పటికే అనేక ప్రేమ కథలు చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రం మరో విభిన్న అనుభూతిని కలిగిస్తుందో లేదో చూడాలి మరి.

Also Read :  తెలంగాణ మట్టివాసనతో మరో కథ.. కాస్టింగ్ కాల్ ప్రకటించిన "రాజు వెడ్స్ రాంబాయి" మేకర్స్