Manoj Manchu : ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. ఫస్ట్ పోస్టర్‌తోనే ఫైర్!

Davidreddy
Manoj Manchu : ఇటీవల ‘భైరవం’ సినిమాతో మెప్పించిన మనోజ్ మంచు, ఇప్పుడు ఓ శక్తివంతమైన హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి కలిసి వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కథ 1897 నుంచి 1922 వరకూ విస్తరిస్తుంది. ఈ పీరియడ్‌లో కుల వ్యవస్థ నుండి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ జీవితం ఆధారంగా ఈ కథ సాగుతుంది. మనోజ్ ఇప్పటివరకు కనిపించని పవర్ఫుల్, మాస్ మరియు ఎమోషనల్ టచ్‌తో కూడిన పాత్రలో నటిస్తున్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇదే రోజున 21 సంవత్సరాల క్రితం ‘దొంగ దొంగది’ సినిమాతో అరంగేట్రం చేసిన మనోజ్, ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత ‘డేవిడ్ రెడ్డి’ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పటికే సంచలనంగా మారింది. మనోజ్ ముఖాన్ని టైటిల్ డిజైన్‌లో మిళితం చేసిన తీరు క్రియేటివ్ గా ఉండటంతో పాటు, “మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.