Kannappa OTT Release :మంచు విష్ణు ‘కన్నప్ప’.. ఇప్పుడు ఓటీటీలోకి!

Kannapap

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ ఈ ఏడాది జూన్‌ 27న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, మోహన్బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి తారాగణం నటించారు. విడుదలై రెండు నెలలు దాటినా ఓటీటీలో రాకపోవడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ను బయట పెట్టారు. ‘కన్నప్ప’ ఈ నెల 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్సైన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ విజువల్ వండర్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

Ghaati Censor Report : ‘ఘాటి’ సెన్సార్ టాక్.. అనుష్క విశ్వరూపం!

కథ ఏమిటంటే.. తిన్నడు (మంచు విష్ణు) ఒక పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు (శరత్ కుమార్) మాటే అతనికి శాసనం. తన గూడెం ప్రజలకోసం ఎప్పుడూ ముందుంటాడు. ఇదే సమయంలో పొరుగు గూడం యువరాణి నెమలి (ప్రీతీ ముకుందన్‌)పై ప్రేమ పెంచుకుంటాడు. గూడెంలోని వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా)తో తిన్నడు పోరాడతాడు.
తర్వాతి పరిణామాల్లో నెమలితో కలిసి అడవికి వెళ్లిన తిన్నడు జీవితం మరో మలుపు తిరుగుతుంది. దేవుడి భక్తురాలైన నెమలి, నాస్తికుడైన తిన్నడుతో ఎలా జీవించింది? ఈ జంట జీవితంలో రుద్రుడిగా (ప్రభాస్) ఎందుకు ప్రవేశించాడు? శివరాత్రి రోజున ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతికాడు? నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడి పరమభక్తుడు *‘కన్నప్ప’*గా ఎలా మారాడు? అనేదే సినిమాకథ.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ జీవితంలో కొత్త చాప్టర్.. ఇంట్లోకి అడుగుపెట్టిన చిన్నారి