Mirai : మెస్మరైజ్ చేస్తున్న తేజ సజ్జా ‘మిరాయ్‌’ రెండో సింగిల్ ‘జైత్రయ’..

Mirai
Mirai : సూపర్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఎంటర్‌టైనర్ ‘మిరాయ్‌’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టి.జి. విశ్వప్రసాద్ మరియు కృతీ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో రెండో సింగిల్ ‘జైత్రయ’ విడుదలైంది. మొదటి పాట వైబ్ ఉంది ఎనర్జిటిక్ యూత్ సాంగ్‌గా నిలిస్తే, ఈ సారి వచ్చిన జైత్రయ మాత్రం తల్లి కలను నెరవేర్చే కథానాయకుడి ప్రయాణాన్ని భావోద్వేగంతో చూపించే శక్తివంతమైన పాటగా నిలిచింది. గౌర హరి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం పాటకు మరింత బలాన్ని ఇచ్చాయి.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన ఆవేశభరిత గాత్రంతో పాడి, పాటలోని ఎమోషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆకట్టుకునే అనిమేటిక్స్, సినిమాటిక్ విజువల్స్ పాటకు గ్రాండియర్‌ను జోడించాయి. ఈ సినిమాలో శ్రియా శరణ్ తేజ సజ్జా తల్లి పాత్రలో కనిపించగా, మనోజ్ మంచు, రితికా నాయక్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయిత, సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేనినే బాధ్యతలు చేపట్టడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్