Peddi : అదరహో అనిపించేలా రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి..’

Peddi
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రోమోలోని చరణ్ హుక్‌స్టెప్ క్షణాల్లో వైరల్ అవ్వగా, ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ సినిమా పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘చికిరి చికిరి’ పాట వినసొంపుగా, ఎనర్జీగా ఉంది. బాలాజీ రాసిన “ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా..” వంటి లిరిక్స్ ఆకట్టుకోగా, మోహిత్ చౌహాన్ గొంతు ఆ పాటకు ప్రత్యేకతను తెచ్చింది. రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి చరణ్ స్టైల్, రెహమాన్ ట్యూన్స్ కలయికగా ఈ పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..