Kishkindhapuri : ‘కిష్కింధపురి’ చాలా బావుంది, తప్పక చూడండి : మెగాస్టార్ చిరంజీవి

Kishkindhapuri
Kishkindhapuri : మెగాస్టార్ చిరంజీవి తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘కిష్కింధపురి’ సినిమాను అభినందించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. హారర్ సినిమాల్లో సాధారణంగా భయం మాత్రమే చూపిస్తారు కానీ కిష్కింధపురిలో మానసిక వైకల్యం, ఒంటరితనం, మనిషి అనుభవించే సమస్యలపై సైకాలజికల్ పాయింట్‌ను చేర్చడం చాలా బాగుందని చిరంజీవి అన్నారు. దర్శకుడు కౌశిక్ ఈ విషయాలను సమర్థవంతంగా చూపించారని ఆయన ప్రశంసించారు.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసుకున్నారని, అనుపమ పరమేశ్వరన్ కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారని చెప్పారు. మంచి సినిమాలను అందిస్తున్న నిర్మాత సాహు గారపాటి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ‘కిష్కింధపురి’ చూడాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు.