
Erra Cheera : బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో కూడా కనిపించనున్నారు. హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే ఈసారి పక్కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రమోద్ పులిగార్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబుతో పాటు శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ, “సినిమాలో డివోషనల్ టచ్ ఉండటంతో, కార్తీక మాసం సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన హైలైట్‌లుగా నిలుస్తాయి” అని తెలిపారు. అలాగే హార్ట్ పేషెంట్స్ సినిమా చూడటానికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు సుమన్ బాబు సూచించారు.
🎬 ‘ErraCheera’ — A blend of mother sentiment, horror & action — hits theatres on October 24th! ❤️🔥
Starring Baby Sai Tejaswini (granddaughter of Rajendra Prasad) & directed by Suman Babu.
Certified 🔞 ‘A’ for its intense horror thrills!#ErraCheera #TeluguCinema #Horror… pic.twitter.com/7EZkInQXgp
— Suresh Kondeti (@santoshamsuresh) October 9, 2025










