Jatadhara : ట్రెండ్ సెట్ చేస్తున్న ‘జటాధర’ సాంగ్!!

Jatadhara
Jatadhara : సుధీర్ బాబు ప్రధానంగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మిథాలజికల్ థ్రిల్లర్ ను జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్, సోల్ ఆఫ్ జటాధార మెస్మరైజ్ చేయగా, తాజాగా ఈ చిత్రం నుండి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈ సాంగ్ ఎనర్జిటిక్ బీట్స్, కలర్ఫుల్ విజువల్స్, మరియు సుధీర్ బాబు డైనమిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రేయా శర్మ తన గ్లామరస్ లుక్ లో మెరిశారు. ఇక రీస్ & జైన్ – సామ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ యూత్‌ఫుల్ ఎనర్జీతో అదిరిపోయింది. లిరిసిస్ట్ శ్రీమణి తెలుగుతో ఇంగ్లీష్ మిక్స్ చేసి క్యాచీ లిరిక్స్ రాయగా.. జితేందర్, రజీవ్ రాజ్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీ ఇచ్చారు. ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా’ సాంగ్ పేరుకి తగ్గట్టే నిజంగానే ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..