Sigma Teaser : సందీప్ కిషన్ స్టైలిష్ అవతార్‌ …

Sigma teaser
లైకా ప్రొడక్షన్స్ నుంచి మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్–అడ్వెంచర్ కామెడీ మూవీ ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్‌తో మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ ప్రారంభంలో హీరో చెప్పే డైలాగ్—“నన్ను మంచి మనిషిగా చూడాలా, చెడ్డవాడిగా చూడాలా, రాక్షసుడిగా చూడాలా అనేది చూసే వారి చూపుపై ఆధారపడి ఉంటుంది… కానీ ఈ క్షణంలో నన్ను కాపాడుకోవడానికి ఎలా మారాలో అలా మారేందుకు సిద్ధం” అనే మాటలు కథకు బలమైన సంకేతం ఇస్తున్నాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

జేసన్ సంజయ్ తన తొలి ప్రయత్నంలోనే స్టైలిష్, హై-ఆక్టేన్ టీజర్‌తో దర్శకుడిగా మంచి ఇంప్రెషన్ ఇచ్చారు. ఎస్. థమన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు అదనపు ఎనర్జీని ఇస్తోంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ విజువల్స్‌కు క్లాసీ టచ్ ఇవ్వగా, లైకా ప్రొడక్షన్స్ మరోసారి టాప్ నాచ్ ప్రొడక్షన్ విలువలను చూపించింది. సందీప్ కిషన్ ఇంతకుముందెన్నడూ కనిపించని మాస్, ఇంటెన్స్ యాక్షన్ అవతార్‌లో అదరగొడుతున్నాడు. ఖజానా వెతుకులాట చుట్టూ తిరిగే కథలో యాక్షన్, ట్విస్టులు, థ్రిల్స్ ఉండనున్నాయని టీజర్ ను చూస్తే తెలుస్తుంది. సందీప్ కిషన్‌కు జంటగా ఫారియా అబ్దుల్లా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ 2026 సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్