Sigma: దళపతి విజయ్ కొడుకు డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ లాంచ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘సిగ్మా స్టైల్’!

Sigma

Sigma: టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ – ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్-అడ్వెంచర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సిగ్మా’ (Sigma). జేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ గురువారం విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా స్టైల్’ సాంగ్ లాంచ్ చేసి టీమ్‌కి బెస్ట్ విశేష్ చెప్పారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన ఊరమాస్ బీట్స్‌ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తుంది. ‘సరిగమ’ తమిళ్, తెలుగు యూట్యూబ్ ఛానెల్స్‌లో విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట ఏకంగా 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఈ సాంగ్ వీడియోలో సందీప్ కిషన్ వేసిన కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆయన ధరించిన స్టైలిష్ లెదర్ జాకెట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేముంది.. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న లుక్స్‌తో సందీప్ కిషన్ లుక్‌ను పోలుస్తూ అభిమానులు సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్, ఎడిట్స్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కేవలం 65 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఒంటరి పోరాటం చేసే వ్యక్తి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన దోపిడీ కథాంశంతో ఈ సినిమాను జేసన్ పక్కా ప్లాన్‌తో తెరకెక్కించారని చెబుతున్నారు.

Also Read :  SPB: నెల్లూరు టు దేశ అత్యున్నత పురస్కారం.. ఎస్పీ బాలు స్పెషల్ స్టోరీ!

ఈ సినిమాను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూనివర్సల్ కంటెంట్‌తో పాన్-ఇండియా అప్పీల్‌తో వస్తున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది. జూలై 31న బాక్సాఫీస్ దగ్గర సందీప్ కిషన్ సరికొత్త మేనియా క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.