Peddi OTT Partner: అఫీషియల్.. ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Peddi telugu movie review

Peddi OTT Partner: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో నటిస్తున్న మోస్ట్ సినిమా ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సర్వం సిద్ధం చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. థియేటర్లలో బొమ్మ పడకముందే డిజిటల్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ జరగగా.. చివరికి ఒక అంతర్జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఈ క్రేజీ డీల్‌ను క్లోజ్ చేసింది.

Also Read :  NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ పోస్ట్!

‘పెద్ది’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రామ్ చరణ్‌కు వచ్చిన అంతర్జాతీయ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ సౌత్ అండ్ నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ వాల్యూ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. రేపు (జూన్ 4) థియేటర్లలో విడుదలవుతున్నందున.. బాక్సాఫీస్ రన్‌ను బట్టి దాదాపు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.