AK47 Movie: త్రివిక్రమ్ మార్క్ మాస్ మసాలా.. ‘AK47’లో నివేదా పేతురాజ్ స్పెషల్ సాంగ్!

Adhika masa purnima (1)

AK47 Movie: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ఈ మాస్ మసాలా సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి స్టెప్పులేసేందుకు గ్లామరస్ బ్యూటీ నివేదా పేతురాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే స్పెషల్ సాంగ్స్ చార్ట్‌బస్టర్స్ అవుతుంటాయి, ఇప్పుడు వెంకీ – నివేదా కాంబోలో రాబోతున్న ఈ పాట కూడా థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read :  Sundeep Kishan: విజయ్ కొడుకు సెట్స్‌లో అలా ఉంటాడని ఊహించలేదు: హీరో సందీప్ కిషన్

హీరోహీరోయిన్స్ , ప్రధాన తారాగణంపై ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్‌ను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసిందట. తాజా లేటెస్ట్ సమాచారం ప్రకారం, జూన్ 10 నుంచి ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందట. ఈ షెడ్యూల్‌లోనే నివేదా పేతురాజ్ చేయబోయే ఐటమ్ సాంగ్‌తో పాటు కొన్ని అత్యంత కీలకమైన సీన్లను షూట్ చేయబోతున్నారని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ (దసరా రేస్) కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, దానికి తోడు ‘AK47’ అనే పవర్‌ఫుల్ టైటిల్, ఇప్పుడీ క్రేజీ ఐటమ్ సాంగ్ అప్‌డేట్ రావడంతో సినీ లవర్స్‌లో ఈ సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి.