Jailer 2: ‘జైలర్ 2’లో హై-వోల్టేజ్ క్యామియో! ఎవరో తెలుసా?

Jailer

Jailer 2: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో క్యామియోలుగా చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌లను అద్భుతంగా ఎలివేట్ చేసిన డైరెక్టర్ నెల్సన్, ఈసారి సీక్వెల్‌లో అంతకుమించిన భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది.

నిజానికి ఈ కీలక పాత్ర కోసం మేకర్స్ ముందుగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారని టాక్ వినిపించింది. అయితే ఆయన తన ప్రస్తుత చిత్రాల షెడ్యూల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో.. ఇప్పుడు ఆ అవకాశం హృతిక్ రోషన్ వద్దకు వచ్చినట్లు సమాచారం. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు హృతిక్ అయితేనే పక్కాగా సెట్ అవుతారని నెల్సన్ భావించారట. నెల్సన్ దిలీప్‌కుమార్‌కు చిన్న పాత్రనైనా సరే, స్క్రీన్‌పై నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ‘జైలర్’లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రల ఎంట్రీ సీన్స్ థియేటర్లలో ఏ రేంజ్ పూనకాలు తెప్పించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ – హృతిక్ రోషన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఇక థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

Also Read :  Singa Title Glimpse: గోపీచంద్ బర్త్ డే బ్లాస్టర్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో ఉలిక్కిపడేలా చేసిన గ్లింప్స్!

ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే, కేవలం సౌత్‌లోనే కాకుండా హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా ‘జైలర్ 2’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విద్యాబాలన్, ఎస్‌.జె. సూర్య వంటి స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి హృతిక్ ఎంట్రీతో దీని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెబుతున్నారు. మేకర్స్ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.