The Paradise: సెప్టెంబర్ 25న థియేటర్స్‌లో నాని జడల్ హంగామా.. సరికొత్త వేటకు డేట్ లాక్!

The Paradise

The Paradise: నాచురల్ స్టార్ నాని అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మరింత భారీ విధ్వంసానికి మేకర్స్ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్టు రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రావడం లేదట. ప్రస్తుతానికి ఆగస్ట్ రిలీజ్ ప్లాన్స్‌ను మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లు సమాచారం.

Also Read :  Singa Title Glimpse: గోపీచంద్ బర్త్ డే బ్లాస్టర్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో ఉలిక్కిపడేలా చేసిన గ్లింప్స్!

ఈ సినిమాలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX)తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతోనే ది ప్యారడైజ్ ఆగస్టు రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడమే లక్ష్యంగా మేకర్స్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వెయిటింగ్ కాస్త పెరిగినప్పటికీ, థియేటర్లలో నాని ఇచ్చే ఇంపాక్ట్ అంతకంతకూ భారీగా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.