Vishnu Vishal: ‘మట్టి కుస్తీ 2’ పై క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చిన హీరో.. పార్ట్ 3 కూడా ఉంటుందంటూ లీక్!

Gatta Kusthi

Vishnu Vishal: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘కట్టా కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ) ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కట్టా కుస్తీ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో విష్ణు విశాల్ పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీక్వెల్‌ను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా, సరికొత్త కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు, ఎంగేజింగ్ సీన్లు ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య వచ్చే ఫన్నీ డ్రామాతో పాటు స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయనను ఫస్ట్ పార్ట్ కథ ఒక ముగింపునకు వచ్చేసింది కదా, మరి రెండో పార్ట్‌కు ఎలా కనెక్ట్ చేస్తున్నారు? అని యాంకర్ అడగ్గా.. విష్ణు విశాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “మొదటి భాగం క్లైమాక్స్‌లోనే మేము సెకండ్ పార్ట్‌కు సంబంధించిన ఒక చిన్న హింట్ (పాయింట్) ఇచ్చాము. అక్కడి నుంచే ఈ రెండో పార్ట్ కథ కొనసాగుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ తర్వాతి స్టేజ్‌కి వెళ్తే ఎలా ఉంటుందనేది ఇందులో చూపిస్తున్నాం” అని చెప్పారు.

Also Read :  Chiyaan63: అఫీషియల్‌గా స్టార్ట్ అయిన ‘చియాన్ 63’.. ‘ఇరు ముగన్’ డైరెక్టర్‌తో విక్రమ్ క్రేజీ కాంబో!

ఈ ఫ్రాంచైజీ ఇక్కడితోనే ఆగదని, ‘కట్టా కుస్తీ 3’ (పార్ట్ 3) చేయడానికి కూడా తమ వద్ద ఒక అద్భుతమైన ఐడియా ఉందని విష్ణు విశాల్ లీక్ చేశారు. దీంతో ఈ సిరీస్ మరిన్ని భాగాల రూపంలో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతోందని స్పష్టమైంది. చెల్లా అయ్యావు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి రెడీ అవుతుంది.