Nelson: నెల్సన్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘జైలర్ 2’ షూటింగ్ కంప్లీట్.. బాక్సాఫీస్ వేట ఆ నెలలోనే!

Jailer

Nelson: తనదైన మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఈరోజు (జూన్ 21) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)తో పాటు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో నయనతార లీడ్ రోల్‌లో వచ్చిన డార్క్ కామెడీ చిత్రం ‘కోలమావు కోకిల’ (తెలుగులో కోకో కోకిల)తో నెల్సన్ డైరెక్టర్‌గా వెండి తెరపైకి తెరంగేట్రం చేశారు.

ఆ తర్వాత శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’, దళపతి విజయ్‌తో ‘బీస్ట్’ చిత్రాలను తెరకెక్కించారు. ఇక 2023లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నెల్సన్ బర్త్‌డే సందర్భంగా ‘జైలర్’ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను షేర్ చేస్తూ ఆయన బ్లాక్‌బస్టర్ మేకింగ్ స్టైల్‌ను అభినందించింది.

Also Read :  varanasi: క్రేజీ అప్‌డేట్.. వారణాసిలో రాముడిగా, శివుడిగా మహేష్ బాబు.!

నెల్సన్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు మరో అదిరిపోయే వార్త అందింది. రజనీకాంత్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినాయక చవితి కానుకగా 2026 సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా డైరెక్టర్ – నిర్మాతగా మారి తన ఓన్ బ్యానర్‌పై కవిన్ హీరోగా ‘బ్లడీ బెగ్గర్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. నెల్సన్ బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్‌లు పెట్టారు.