Mahesh Babu: ‘రావు బహదూర్’ సినిమాపై మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ రివ్యూ.. చూశారా!

Rao Bahadur

Mahesh Babu: టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ స్వంత బ్యానర్ ‘GMB ఎంటర్‌టైన్‌మెంట్’ పై స్వయంగా సమర్పిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ‘రావు బహదూర్’ ప్రపంచాన్ని, సత్యదేవ్ నటనను ఆకాశానికెత్తేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన వేసిన ట్వీట్‌లో.. “రావు బహదూర్ మీ కాలర్ పట్టుకుని లాగడమే కాదు.. మీ బాడీలోకి, స్కిన్‌లోకి దూరిపోయే ఒక ఇంటెన్స్ ఎమోషన్” అంటూ సినిమాని కొనియాడారు. ఈ చిత్రంలో సత్యదేవ్ నటన అద్భుతంగా ఉందంటూ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read :  Rao Bahadur: ‘రావు బహదూర్’ డిజిటల్ రైట్స్ రేట్ ఎంతో తెలుసా?

రావు బహదూర్ సృష్టించిన ఆ ప్రత్యేకమైన ప్రపంచాన్ని నటుడు సత్యదేవ్ తన విశ్వరూపంతో పూర్తిగా ఆక్రమించేశాడంటూ సత్యదేవ్ యాక్టింగ్‌కు మహేష్ ఫ్లాట్ అయిపోయారు. “థియేటర్లలో ఆ ‘మ్యాడ్‌నెస్’ చూడటానికి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను” అని మహేష్ బాబు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. మహేష్ బాబు స్వయంగా ఈ రేంజ్‌లో రివ్యూ ఇవ్వడంతో ‘రావు బహదూర్’ చిత్రంపై ప్రేక్షకుల్లో, టాలీవుడ్ వర్గాల్లో అంచనాలు స్కై హైకి చేరాయి. సత్యదేవ్ కెరీర్‌లో ఇది ఒక మైల్‌స్టోన్ మూవీగా నిలవబోతోందని మహేష్ బాబు ట్వీట్‌తో స్పష్టమవుతోంది.