
Zombie Reddy 2: టాలీవుడ్‌లో సరికొత్త జోనర్‌కి నాంది పలికిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘జాంబీ రెడ్డి పార్ట్ 2’ షూటింగ్ పనులు అధికారికంగా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
నిజానికి ఈ క్రేజీ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం దీని వెనుక ఉన్న క్రేజీ టీమ్. ఈ చిత్రానికి ‘రానా నాయుడు’ వంటి వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన సుపర్ణ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో అద్భుతమైన కథనంతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ, ఈసారి ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ, స్టార్ కిడ్ షనాయా కపూర్ ఎంపికయ్యారని టాక్. ఆమె ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో, హీరోయిన్‌గా ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్ అందించిన వినోదం, థ్రిల్.. ఈ పార్ట్ 2లో ఏ స్థాయిలో ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, తదుపరి షెడ్యూల్స్ కోసం సన్నాహాలు చేస్తోందట. టెక్నికల్ వాల్యూస్, మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరిన్ని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.









