AA23 బ్లాస్ట్.. టైటిల్ టీజర్ షూట్ పూర్తి చేసిన లోకేష్!

AA23

AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం (#AA23) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ క్రేజీ కాంబో గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే అప్‌డేట్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా అధికారిక టైటిల్ టీజర్ కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటికే అల్లు అర్జున్‌పై కీలకమైన ఫుటేజ్ షూటింగ్‌ను పూర్తి కంప్లీట్ చేసినట్లు సమాచారం.

సాధారణంగా లోకేష్ కనగరాజ్ తన సినిమాల అనౌన్స్‌మెంట్ లేదా టైటిల్ రివీల్ చేసే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. గతంలో కమల్ హాసన్ ‘విక్రమ్’, దళపతి విజయ్ ‘లియో’, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాల టైటిల్ టీజర్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా కంపోజ్ చేసిన మ్యూజిక్, హీరోల ఊరమాస్ ఎలివేషన్లతో కూడిన ఆ ఫస్ట్ వీడియోలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ సినిమా కోసం కూడా లోకేష్ ఒక మైండ్ బ్లోయింగ్ టైటిల్ టీజర్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ మాస్ స్వాగ్‌కు లోకేష్ రానెస్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ క్రేజీ టైటిల్ టీజర్ వీడియోని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో పాన్ ఇండియా రేంజ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.