
Zombie Reddy 2: తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ‘జాంబీ రెడ్డి 2’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘హనుమాన్’ భారీ సక్సెస్ తర్వాత తేజ సజ్జ వరుసగా భారీ బడ్జెట్, కంటెంట్ ఓరియెంటడ్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. గతంలో ఆయన హీరోగా నటించిన జాంబీ రెడ్డి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘జాంబీ రెడ్డి 2’ చిత్రానికి రూ.45 నుంచి రూ.50 కోట్ల వరకు నాన్-థియేట్రికల్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు పెట్టుబడిలో పెద్ద మొత్తంలో రికవరీ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే, రూ.45-50 కోట్ల నాన్-థియేట్రికల్ డీల్ గురించి ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.













