
Rajinikanth Autobiography: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరైన రజనీకాంత్ తన జీవిత కథను ఆత్మకథ రూపంలో సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆయన సినీ ప్రయాణం, జీవితంలో ఎదురైన ఎన్నో ఆసక్తికర సంఘటనలు, భావోద్వేగ క్షణాలు, విజయాల వెనుక ఉన్న కథలు పొందుపరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణాన్ని ఈ ఆత్మకథలో విపులంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు ఇప్పటివరకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాదని ఈ ఆత్మకథను భవిష్యత్తులో సినిమాగా తెరకెక్కించే అవకాశాలపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే రజనీకాంత్ తన అత్యంత సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశముందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే రజనీకాంత్ ఆత్మకథపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటి రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.














