Suriya 48: మాస్‌కు ముందు సూర్య క్లాసీ ట్రీట్.. ‘S48’పై అదిరిపోయే న్యూస్!

Suriya

Suriya 48: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్‌లో 48వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘Suriya 48’పై ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ‘S48’లో సూర్య డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ‘జై భీమ్’ తరహా సీరియస్ సోషల్ డ్రామా కాకుండా.. ‘సూరరై పొట్రు’ తరహాలో క్లాసీ, ఎమోషనల్ టచ్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే సూర్య 49, 50వ సినిమాలు పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్లుగా ఉండనున్నాయనే ప్రచారం జరుగుతుంది. అందుకే వాటికి ముందు ఓ డిఫరెంట్, క్లాసీ కథను సూర్య ఎంచుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే.. మాస్ సినిమాల్లోకి వెళ్లే ముందు తనలోని క్లాసీ హీరోను మరోసారి ప్రేక్షకులకు చూపించేందుకు సూర్య ‘S48’ను ఎంచుకున్నారన్నమాట. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిలిమ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ మూవీలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘కరుప్పు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సూర్య–జ్ఞానవేల్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.