Billa Ranga Baasha: సెప్టెంబర్ 2న ఫస్ట్ అప్‌డేట్.. ‘బిల్లా రంగా బాషా’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్!

Billa Ranga Baasha

Billa Ranga Baasha: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బిల్లా రంగా బాషా’ (BRB)పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ తొందరపడకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను సుదీప్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. కేవలం వరుస అప్‌డేట్స్‌తో హైప్ పెంచడం కాకుండా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌ను సరైన సమయంలో విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను క్రమంగా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ‘బిల్లా రంగా బాషా’కు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇక సినిమా ప్రమోషన్ టైమ్‌లైన్‌ను కూడా మేకర్స్ ముందుగానే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2027 సంవత్సరంలో తొలి త్రైమాసికంలో టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అనంతరం అదే ఏడాది మూడో త్రైమాసికంలో ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక 2027 చివరి త్రైమాసికంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘బిల్లా రంగా బాషా’ చిత్రాన్ని నిరన్ రెడ్డి నిర్మిస్తుండగా, అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో తన విభిన్నమైన కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనూప్ భండారి.. ఈసారి సుదీప్‌ను భారీ స్కేల్‌లో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడకుండా, ప్రేక్షకులు పెట్టే సమయానికి తగిన విలువను అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అందుకే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘బిల్లా రంగా బాషా’ విషయంలో హడావుడి కంటే క్వాలిటీ, సరైన టైమింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న మేకర్స్.. 2027లో సుదీప్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ప్రత్యేక పోస్టర్‌తో ఈ సినిమా ప్రమోషనల్ జర్నీ అధికారికంగా మొదలుకానుంది.