Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ లో భాగం అవ్వడం గ్రేట్ హానర్ : అమితాబ్ బచ్చన్


మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ ‘కల్కి 2898 AD’. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్ తో సందీప్ కిషన్ మూవీ..

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్ కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. ఇందులో వున్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

Kalki 2898 AD : ‘కల్కి’.. అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్ : డైరెక్టర్ నాగ్ అశ్విన్