
Baahubali 3: భారతీయ సినీ చరిత్రను తిరగరాసి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన అత్యంత ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చెక్కిన ఈ విజువల్ వండర్‌కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ అనే పేరుతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీస్ చేసింది. ఈ డాక్యుమెంటరీ ముగింపులో చిత్ర యూనిట్ ఇచ్చిన ఒక సంచలన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నాలుగు ఎపిసోడ్లుగా సాగిన ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో సినిమా నిర్మాణం వెనుక పడిన కష్టం, మహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన విధానాన్ని కండ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ సిరీస్ ముగింపులో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఈ వీడియోలో ‘బాహుబలి’ స్టార్స్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి ఒకే సోఫాలో కూర్చుని ముచ్చటిస్తూ కనిపించారు. ఈ ప్రత్యేక వీడియోలో రానా దగ్గుబాటి సరదాగా నవ్వుతూ.. “నేను ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పవచ్చో లేదో తెలియదు. కానీ, రాజమౌళి సర్, శోభు గారు ఇక్కడ లేరు కాబట్టి నా మనసులో ఉన్నది చెప్పేస్తున్నా.. ఈ ప్రపంచం ఇంకా దీనికి సిద్ధంగా లేదు, కానీ ‘బాహుబలి’ ఇంకా ఉంది అని వ్యాఖ్యానించారు. రానా ఈ మాట చెప్పగానే పక్కనే ఉన్న ప్రభాస్ నవ్వుతూ.. తన చేతి మూడు వేళ్లను (3 ఫింగర్స్) చూపిస్తూ ‘పార్ట్ 3’ రాబోతోందనే హింట్ ఇచ్చారు. ఇది చూసి పక్కనే ఉన్న అనుష్కతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘బాహుబలి 3’ అఫీషియల్‌గా రాబోతోందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై దర్శకుడు రాజమౌళి గానీ, ఆర్కా మీడియా నిర్మాతలు గానీ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
What !!! 🤯
Baahubali 3 on cards ??? 🔥🔥💥🥵💥🔥💥🥵#Prabhas #BaahubaliTheTorchbearer#Baahubali3pic.twitter.com/L271D8itZW
— Rakesh_17 (@Rakesh_17_) June 25, 2026












