War 2 Telugu Rights : వార్ 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నాగవంశీ ?


War 2 Telugu Rights : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్ సరసన ఆయన పాత్ర పూర్తిగా డామినేట్ చేసే విధంగా ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదలకానుంది. అదే రోజు రిలీజ్ కానున్న రజినీకాంత్ ‘కూలీ’తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతోంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఇక ఈ సినిమాకి సంబంధించి తాజా సమాచారం మేరకు, తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ సొంతం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అభిమానిగా ఉండే నాగవంశీ, ఆయన గత చిత్రం ‘దేవర’ హక్కులు కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘వార్ 2’ తెలుగు హక్కుల కోసం భారీ పోటీ నెలకొనగా, నిర్మాతలు దాదాపు ₹100 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే సుమారు ₹80 కోట్ల వరకు నాగవంశీ పెట్టేందుకు రెడీ అయ్యారని ఉదయం నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరకు ఈ డీల్ ఎంతకీ క్లోజ్ అయిందన్నది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయినా, ఫైనల్‌గా తెలుగు రాష్ట్రాల్లో అన్ని భాషలలో ‘వార్ 2’ని నాగవంశీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.