War 2 : ‘వార్ 2’ కోసం మళ్ళీ అదే స్ట్రాటజీ..?

War2
War 2 : ఆదిత్య చోప్రా మూడున్నర దశాబ్దాలుగా బాలీవుడ్‌కి ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలను అందిస్తూ, ప్రతిసారీ కొత్త రకమైన ప్రమోషన్ స్ట్రాటజీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్‌ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ కోసం ఆయన తన కజ్రా రే, ధూమ్ 3 రేంజ్‌లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇద్దరు డ్యాన్స్ లెజెండ్స్ కలిసి స్క్రీన్‌పై సందడి చేయనున్న డ్యాన్స్ నంబర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రేపు రిలీజ్ చేయనున్నారు.

భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎనర్జిటిక్‌గా, విజువల్ ఫీస్ట్‌లా ఉండబోయే ఈ పాట డాన్స్ సీక్వెన్సుల్లో అద్భుతంగా మారనుంది. ఈ పాటలో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సినీ పవర్ హౌసెస్ లాంటి స్టార్స్ కనిపించబోతున్నారు. తెలుగులో ‘సలాం అనాలి..’, హిందీలో ‘జనాబెఅలీ..’ అంటూ సాగే ఈ పాట నుంచి రేపు ఉదయం గ్లింప్స్‌ను విడుదల చేస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్. అయితే, ఈ పాటను పూర్తిగా చూసి ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిందే.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఇంతకుముందు కూడా ‘బంటీ ఔర్ బబ్లీ’ లోని ‘కజ్రా రే’, ‘ధూమ్ 3’లోని ‘కంమ్లీ’ వంటి పాటలన్నీ మొదటిసారి థియేటర్లోనే చూపించి, ఆడియెన్స్‌లో ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించిన ఆదిత్య చోప్రా.. ఇప్పుడు అదే మంత్రాన్ని ‘వార్ 2’ లోనూ ఫాలో అవుతున్నారు. థియేటర్లోనే ఎన్టీఆర్-హృతిక్ కలసి చేసే డ్యాన్స్‌ను చూడాలనేది నిర్మాతల ప్లాన్. ఈ పాన్-ఇండియా మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.