Rashmika: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అల్లు అర్జున్‌తో రష్మిక మైండ్ బ్లోయింగ్ ఫైట్!

Rashmika Mandanna

Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ముంబైలో గ్రాండ్‌గా మొదలైంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

‘పుష్ప’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ చిత్రంతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈసారి వీరి కాంబినేషన్ సరికొత్తగా ఉండబోతోందట. తాజా సమాచారం ప్రకారం, రష్మిక మందన్న త్వరలోనే ఈ ముంబై షెడ్యూల్‌లో జాయిన్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె మునుపెన్నడూ చూడని విధంగా ఒక నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే ఈ కొత్త ఈక్వేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

Also Read :  Nelson: నెల్సన్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘జైలర్ 2’ షూటింగ్ కంప్లీట్.. బాక్సాఫీస్ వేట ఆ నెలలోనే!

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండటంతో ‘రాకా’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.