Krish Jagarlamudi : ఘాటి అనుష్క శెట్టి కెరీర్‌లో మరో ఐకానిక్ మూవీ అవుతుంది

Krish

లార్జెస్ట్ కాన్వాస్‌పై వస్తున్న ఘాటిలో ఆడియన్స్ ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. సౌత్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటి’ సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించగా, విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

UV క్రియేషన్స్ సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకరుల సమావేశంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఘాటి కథ ఎలా మొదలైంది?

“నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ఘాటి ఐడియా డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారి నుంచి వచ్చింది. ఆయన రాసిన 30 పేజీల కథ నన్ను బాగా ఆకట్టుకుంది. ఆంధ్ర–ఒరిస్సా బోర్డర్‌లో గంజా మోసే కూలీలను ‘ఘాటీలు’ అంటారు. వారి జీవనశైలి, నేపథ్యం చాలా కొత్తగా అనిపించింది. తూర్పు కనుమల్లో లొకేషన్లు చూసిన తర్వాత ఈ కథను పెద్ద కాన్వాస్‌లో చెప్పాలని నిర్ణయించుకున్నాను.” – అని క్రిష్ తెలిపారు.

అనుష్క శెట్టి కోసం రాసిన శీలావతి పాత్ర

“ఈ కథ హీరోయిన్‌-సెంట్రిక్. వేదం తర్వాత స్వీటీ గారితో మరోసారి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. శీలావతి పాత్రలో అనుష్క గారి గ్రేస్, యాటిట్యూడ్, స్టార్‌డమ్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఆడియన్స్ మైండ్‌లో దీర్ఘకాలం గుర్తుండిపోతుంది.”

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

సోషల్ ఇష్యూతో యాక్షన్ డ్రామా

“గంజా అనేది ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా, అది సమాజంలోకి వస్తూనే ఉంటుంది. సర్వైవల్ కోసం చేసినా దాని ప్రభావాలు తీవ్రంగానే ఉంటాయి. ఇదే నేపథ్యంతో ఘాటిని యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాం. ఎందుకంటే ఆ ప్రాంత పరిస్థితులు తీవ్రమైన భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలకే అనుకూలంగా ఉంటాయి.”

విక్రమ్ ప్రభు & ఇతర నటీనటులు

విక్రమ్ ప్రభు: “దేశిరాజు పాత్ర రాస్తున్నప్పుడే ఆయన గుర్తుకు వచ్చారు. చాలా స్వచ్ఛమైన నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు.”

చైతన్య రావు: “30 వెడ్స్ 20 వెబ్ సిరీస్‌లో ఆయన పనితీరు చూసి, కుందుల నాయుడు అనే విలన్ పాత్రలోకి ఆయనను తీసుకున్నాం. ట్రైలర్‌లో కనిపించినది చాలా తక్కువ, అసలు మ్యాజిక్ సినిమాలో ఉంటుంది.”

రవీంద్ర విజయ్ & రాజసుందరం మాస్టర్ కూడా కీలకమైన, కొత్త తరహా పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాటోగ్రఫీ & మ్యూజిక్ ప్రత్యేకత

DOP మనోజ్: “తూర్పు కనుమల సహజసిద్ధ సౌందర్యాన్ని అద్భుతంగా చూపించారు. స్క్రీన్‌పై ఆ ప్రకృతిని ఆత్మతో చూపించగలిగారు.”

మ్యూజిక్ డైరెక్టర్ సాగర్: “కొండలకి ఒక మ్యూజికల్ లాంగ్వేజ్ ఉంటే అది ఎలా ఉంటుందో ఆ అనుభూతి ఇచ్చేలా ఇన్నోవేటివ్ ఫ్యూజన్ మ్యూజిక్ అందించారు. ఆడియన్స్‌కి ఇది కొత్త అనుభవం అవుతుంది.”

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈస్టర్న్ ఘాట్స్ షూట్ అనుభవం

“ఫస్ట్ టైం అక్కడ షూట్ చేశాం. ఒక కొండమీద నిలబడి ఇంకో కొండని షూట్ చేయడం జరిగింది. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చాలా అద్భుతంగా బంధించాం. ఈ విషయంలో అనుష్క గారు, విక్రమ్ ప్రభు గారికి సపోర్ట్ చెప్పాల్సిందే.”

సాయి మాధవ్ మాటల మాంత్రికం

“సాయి మాధవ్ గారి మాటలు ఎప్పటిలాగే ఆడియన్స్ హృదయాలను తాకుతాయి. ‘స్వేచ్ఛ పథకాలన్నీ ఒకప్పటి బందీలే… సందేశాలన్నీ తప్పుల నుంచి నేర్చిన పాఠాలే’ అనే పాట పల్లవిని ఆయన డైలాగ్‌గా మార్చారు. ఆయన రాత ఈ సినిమాకి ఒక పెద్ద బలం.”

నిర్మాతల సపోర్ట్ & అనుష్క శెట్టి బలం

“రాజీవ్ రెడ్డి, సాయిబాబా, యువీ క్రియేషన్స్ టీమ్ ఈ సినిమాని ప్యాషన్‌తో చేశారు. అనుష్క శెట్టి సినిమా బాగుంటే దాని రేంజ్ ఎలా ఉంటుందో ‘అరుంధతి’ నుంచి ‘భాగమతి’ వరకు మనం చూశాం. ఘాటీలో ఆమెకు మరో ఐకానిక్ పాత్ర దొరికింది. మేమంతా రాజీ పడకుండా, లార్జెస్ట్ కాన్వాస్‌పై ఈ సినిమాని నిర్మించాం.”

ఘాటి కేవలం యాక్షన్ డ్రామా కాదు, అది ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తెస్తుంది. అనుష్క శెట్టి మరోసారి తన కెరీర్‌లో ఐకానిక్ రోల్ చేయనుందని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నమ్మకం వ్యక్తం చేశారు.