Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి హార్ట్‌ టచ్చింగ్ లవ్ మెలోడీ విడుదల..

Arjun chakravarthy
Arjun Chakravarthy : విజయ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పటికే మంచి గుర్తింపు పొందుతోంది. కబడ్డీ ఆటగాడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అత్యద్భుతమైన స్పందన లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ వ్యూస్, యూట్యూబ్‌లో 1.5 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభిస్తూ, ఫస్ట్ సింగిల్ ‘మేఘం వర్షించదా’ ను విడుదల చేశారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

విఘ్నేష్ బాస్కరన్ ఈ బ్యుటీఫుల్ లవ్ సాంగ్ ను కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వున్నాయి. ఇక కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్ తో కట్టిపడేశారు. విజయ రామరాజు, సిజా రోజ్‌ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ పాట ద్వారా సినిమా కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, హృదయాన్ని తాకే ప్రేమకథగా కూడా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!